: మిషన్ కాకతీయ వైపు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వైపు ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ కాకతీయపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువుల్లో పూడిక తీయడంతోనే పని పూర్తయిపోదని అన్నారు. చెరువుల్లోకి నీరు తెచ్చే కాలవలపైన, మట్టిని రైతుల భూముల్లోకి తరలించడం వంటి వాటిపైన ఏకకాలంలో దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. పనుల్లో నాణ్యత పాటించని గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పూడిక మట్టికి డిమాండ్ ఉంటే కనుక బహిరంగ వేలం వేయాలని ఆయన సూచించారు.