: సల్మాన్ కేసుకు అంత ప్రచారమా?...మీడియా తీరు మారాలి: సెన్సార్ బోర్డు సభ్యుడు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసుకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సరికాదని సెన్సార్ బోర్డ్ సభ్యుడు అశోక్ పండిట్ హితవు పలికారు. పనాజీలో ఆయన మాట్లాడుతూ, హిట్ అండ్ రన్ కేసులో శిక్షపడిన సల్మాన్ ఖాన్ పై మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచారం చేయడంపై మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. దేశంలో మరేసమస్య లేనట్టు, సల్మాన్ ఖాన్ కేసు మినహా మరేదీ లేనట్టు మీడియా కథనాలు ప్రసారం చేసిందని ఆయన తప్పు పట్టారు. ఇది మంచి పద్ధతికాదని, శుభపరిణామం కూడా కాదని ఆయన తెలిపారు. బాలీవుడ్ లో ఎక్కువ మంది నిర్మాతలు నష్టాల్లో ఉన్నారని, హైప్ కోసమే బాక్సాఫీస్ రికార్డులంటూ హంగామా చేస్తారని పండిట్ అన్నారు.

  • Loading...

More Telugu News