: రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాల పొడిగింపు నేపథ్యంలో, రాహుల్ పర్యటనను వాయిదా వేసినట్టు అర్థమవుతోంది. వాస్తవానికి ఆయన ఈ నెల 10న హైదరాబాద్ చేరుకుని, 11న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని కూడా ప్రకటించారు. అయితే, పార్లమెంటు సమావేశాలను ఈ నెల 13 వరకు పొడిగించడంతో, తాజా నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఈ నెల 15న రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తారని రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

  • Loading...

More Telugu News