: ఉత్సాహంగా ఇంటికి చేరిన సల్లూభాయ్


హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెషన్స్ కోర్టు ఫార్మాలటీస్ అన్నింటినీ పూర్తి చేసి ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నాడు. 30 వేల రూపాయల పూచీకత్తు, పాస్ పోర్టును సెషన్స్ కోర్టుకు సరెండర్ చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు సల్మాన్ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకాలేదు. బెయిల్ మంజూరు కావడంతో బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ నుంచి సెషన్స్ కోర్టుకు చేరుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. అన్నీ పూర్తి చేసి, ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నాడు. సల్మాన్ ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News