: పరకాల, పాలకుర్తి... ఎక్కడైనా పోటీకి సిద్ధమే: ఎర్రబెల్లికి పరకాల ఎమ్మెల్యే సవాల్


టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసురుతున్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఎర్రబెల్లి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. పరకాల గానీ, పాలకుర్తి గానీ ఎక్కడైనా పోటీకి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని ఎర్రబెల్లిని ప్రశ్నించారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీలో చేరారని, అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని ధర్మారెడ్డి తెలిపారు. ఆంధ్రాలో పార్టీలు మారితే తప్పులేదు గానీ, బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరితే తప్పవుతుందా? అని అడిగారు.

  • Loading...

More Telugu News