: ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు
హైదరాబాదులోని చిలకలగూడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు తన వెంటతెచ్చుకున్న కత్తితో ప్రియుడిని పొడిచింది. ప్రియురాలి దాడిలో గాయాలపాలైన ప్రియుడ్ని స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరిట దగ్గరైన ప్రియుడు, వివాహానికి ముఖం చాటేయడంతో దాడి జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా, దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.