: అగ్రిగోల్డ్ మోసంలో చంద్రబాబు, అతని తాబేదార్ల హస్తముంది: బొత్స
అగ్రిగోల్డ్ వందల కోట్ల కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అతని తాబేదార్ల హస్తముందని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, వేల కోట్ల కుంభకోణం జరిగితే, బాధితులంతా రోడ్డెక్కి నినదిస్తే, వారిని అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, మోసగాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో ఇంతపెద్ద కుంభకోణం జరిగితే దాని గురించి ముఖ్యమంత్రి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు ఇందులో భాగస్వామ్యం ఉండడంతో ఆ పార్టీ నేతలు పెదవివిప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తుంటే దానిని పరిష్కరించాల్సిన సీఎం జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఆయన తెలిపారు.