: అల్లుడి విజయంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హర్షం


బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థి రిషి సునాక్ ఎంపీగా విజయం సాధించడం తెలిసిందే. రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావడంతో ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, అల్లుడి విజయంపై నారాయణమూర్తి స్పందించారు. భారీ మెజారిటీతో రిషి గెలవడంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రిషి నిబద్ధత ఉన్న వ్యక్తి అని కొనియాడారు. బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News