: సల్మాన్ బెయిల్ ఈరోస్ షేర్లను ఒడ్డున పడేసింది


బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా కంపెనీ షేర్లను ఒడ్డున పడేసింది. సల్మాన్ ఖాన్ కు శిక్ష పడడంతో 'భజరంగీ భాయ్ జాన్' సినిమాను నిర్మిస్తున్న ఈరోస్ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో షేర్ హోల్డర్లు ఆందోళనలో పడిపోయారు. సల్మాన్ కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోస్ షేరు 4.29 శాతం పెరిగి 402 రూపాయల వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీలో 4.13 శాతం పెరిగి 403 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా, సల్మాన్ తో మరో సినిమా నిర్మాణానికి ఈరోస్ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. 'భజరంగీ భాయ్ జాన్' ఈ నెల 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

  • Loading...

More Telugu News