: వైసీపీ నేతలకు 14 రోజుల రిమాండ్
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యానంతర సంఘటనల కేసుకు సంబంధించి వైసీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ రోజు వారిద్దరు సహా 32 మందిని పోలీసులు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ కు పంపింది. వైసీపీ నేతలపై కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వారి తరపు న్యాయవాది నారాయణ రెడ్డి అన్నారు. వారందరూ ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని పోలీసులు అభియోగాలు మోపటాన్ని న్యాయవాది తప్పుబట్టారు. ఈ విషయంపై హెచ్ ఆర్సీని ఆశ్రయించామని, డీజీపీ నుంచి ఎస్పీ వరకు చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.