: రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టి... అడ్డుకున్న వారిని కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ దేనని ఆయన దెప్పిపొడిచారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంతో దోపిడి చేసిందని, దానికి రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడెందుకు భరోసా కల్పించలేదని కిషన్ సూటిగా ప్రశ్నించారు. ద్వంద్వ విధానం కాంగ్రెస్ కు అలవాటేనని, వాటికి సమాధానం చెప్పాకే రాహుల్ తెలంగాణలో అడుగుపెట్టాలని లేఖలో పేర్కొన్నారు.