: సత్యం రామలింగరాజు బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా


సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైదరాబాదులోని నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సత్యం నిందితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా కూడా విధించడంతో రామలింగరాజు సహా తొమ్మిది మంది చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

  • Loading...

More Telugu News