: సైనాకు కేంద్రం నజరానా


ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక అవార్డుల పథకం కింద, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించే క్రీడాకారులు, వారి కోచ్ లకు నగదు బహుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్ గా సైనా చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో ఆమె స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలైంది.

  • Loading...

More Telugu News