: గూగుల్ పై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతోంది: అరుణ్ జైట్లీ


ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పై నాలుగు విభిన్న కేసుల్లో 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) విచారణ జరుపుతోందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంట్ కు తెలిపారు. తన ఆధిపత్యాన్ని గూగుల్ తప్పుడు మార్గాన వినియోగిస్తున్నదని వచ్చిన ఫిర్యాదులపై సీసీఐ విచారణ జరుపుతోందని లోక్ సభలో సభ్యులడిగిన ప్రశ్నకు తన లిఖితపూర్వక సమాధానంలో జైట్లీ తెలిపారు. కన్సిమ్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ లు గూగుల్ ఐఎన్ సీ, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లపై రెండు కేసులు పెట్టాయని ఆయన వివరించారు. మరో రెండు కేసులను విశాల్ గుప్తా, ఆల్బియాన్ ఇన్ఫో టెల్ లిమిటెడ్ లు గూగుల్ ఐఎన్ సీ, గూగుల్ ఐర్లాండ్, గూగుల్ ఇండియాలను భాగం చేస్తూ దాఖలు చేశాయని పేర్కొన్నారు. అయితే, ఈ కేసుల్లో భారత ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వచ్చినట్టూ ఆధారాలు లేవని తెలిపారు.

  • Loading...

More Telugu News