: బ్రిటన్ లో మళ్లీ జయకేతనం ఎగురవేసిన కన్జర్వేటివ్ పార్టీ... కామెరాన్ కే పట్టం
బ్రిటన్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ మరోసారి జయకేతనం ఎగురవేసింది. పార్లమెంటులో మొత్తం 650 సీట్లు ఉండగా కన్జర్వేటివ్ లకు 329 సీట్లు వచ్చాయి. మెజార్టీ సాధనకు 326 సీట్లు రావాల్సి ఉండగా మూడు సీట్లు అధికంగానే గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ మళ్లీ ప్రధానిగా కొనసాగనున్నారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ 233 సీట్లు గెలుపొందగా, స్కాటిష్ నేషనల్ పార్టీ 56 సీట్లను కైవసం చేసుకుంది. మిగిలిన సీట్లను ఇతరులు గెలుచుకున్నారు.