: సానియా మీర్జా, లియాండర్ పేస్ లకు చుక్కెదురు
మాడ్రిడ్ లో జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ లో భారత టాప్ టెన్నిస్ ప్లేయర్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్ లకు చుక్కెదురైంది. సెకండ్ రౌండ్ లో పేస్, డేనియల్ నెస్టర్ ల జోడీ లిసియానో లోపెజ్, మ్యాక్స్ మిర్న్యి జోడీ చేతిలో ఓటమిపాలైంది. ఏడో సీడ్ గా బరిలో దిగిన పేస్ జంట 6-7(4), 3-6తో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు వెటరన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో కలసి విజయపథంలో దూసుకుపోతున్న ప్రపంచ నంబర్ వన్ సానియామీర్జాకు కూడా పరాజయం తప్పలేదు. మహిళల డబుల్స్ లో వీరిద్దరి జోడీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది. బెథానీ మ్యాటెక్ శాండ్స్, లూసీ సఫరోవా జోడీతో జరిగిన మ్యాచ్ లో సానియా జంట 6-7(5), 6-3, 9-11తో ఓడిపోయింది.