: తెలంగాణ ఉన్నత విద్యా మండలిగా మార్పు


హైకోర్టు తీర్పుతో ఉమ్మడి ఉన్నత విద్యా మండలిని తెలంగాణ ఉన్నత విద్యా మండలిగా అధికారులు మార్పు చేశారు. ఏపీ మండలి భవనం, తదితరాలన్నీ తెలంగాణ మండలికే చెందుతాయని కోర్టు తీర్పు చెప్పడంతో... ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్న పాపిరెడ్డి ఈ రోజు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. మొత్తం వ్యవహారంలో ఏపీ ఉన్నత విద్యా మండలికి అడ్రస్ లేకుండా పోయింది. అంతేగాక మండలి బ్యాంకు ఖాతాలు అంతకుముందే స్తంభింపచేయడంతో అవి కూడా తెలంగాణ మండలికే చెందనున్నాయి. ఈ విషయంపై త్వరలో ఏపీ మండలి సుప్రీంకోర్టుకు వెళ్లనుందని సమాచారం.

  • Loading...

More Telugu News