: అంత ఫిట్ మెంట్ కావాలని పట్టుబట్టడం సరికాదు: చంద్రబాబు
తాను అధికారంలోకి రాగానే రూ.250 కోట్లతో ఆర్టీసీని ఆదుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానీ కార్మికులు మాత్రం 43 శాతం ఫిట్ మెంట్ కావాలని పట్టుబడుతున్నారని, ఇది సరికాదని సీఎం చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, డిమాండ్ లన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. కొన్ని పత్రికలు, చానళ్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న చంద్రబాబు, సినిమా నటులను కూడా స్మగ్లింగ్ ఉచ్చులోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ రోజు కడప జిల్లా పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వీరపునాయని పల్లె మండలంలో ఉన్న సర్వరాయప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి, వచ్చే సీజన్ కల్లా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించాలని అధికారులను ఆదేశించారు.