: నల్గొండ ఎస్పీ ఆఫీస్ లో మిస్ ఫైర్... గాయపడ్డ సీఐ
నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. గన్ మెన్ తన గన్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ భాస్కర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో, వెంటనే భాస్కర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.