: సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై ప్రారంభమైన విచారణ... కోర్టుకు హాజరు కాని సల్మాన్
'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు రెండు రోజుల క్రితం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వెంటనే, బెయిల్ కోసం సల్మాన్ న్యాయవాదులు బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ క్రమంలో, సల్మాన్ కు రెండు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. రెండు రోజుల గడువు ముగియడంతో, ఈ రోజు బాంబే హైకోర్టులో సల్మాన్ బెయిల్ పై విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే, నేటి విచారణకు సల్మాన్ హాజరు కాలేదు. ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కోర్టుకు హాజరయ్యారు.