: ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వచ్చి బుక్కయిన చైనా వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ అడవుల నుంచి స్మగ్లర్లు సేకరించిన ఎర్రచందనంను తమ దేశానికి స్మగ్లింగ్ చేసేందుకు వచ్చిన చైనా జాతీయుడు యియాంగ్ పింగ్ ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న యియాంగ్ ను ఈ ఉదయం అరెస్ట్ చేశామని, ఆయనతో పాటు హైదరాబాదుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. పెద్దఎత్తున రెడ్ శాండల్ విదేశాలకు తరలిపోనున్నదన్న విషయంపై సమాచారం అందుకున్న ఏపీ స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చిత్తూరులో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.