: ప్రస్తుత ఉమ్మడి న్యాయస్థానంపై మాకు నమ్మకం లేదు: కేకే
ఏపీ, తెలంగాణకు ఉమ్మడిగా ఉన్న ప్రస్తుత హైకోర్టుపై తమకు నమ్మకం లేదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. భూ వివాదాల్లో తీర్పులన్నీ ఆంధ్రాకే అనుకూలంగా వస్తున్నాయని ఆరోపించారు. అవసరమైతే తెలంగాణ కేసుల విచారణను వేరే ఉన్నత న్యాయస్థానానికి బదలాయించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కోరినట్టు చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 31, 32లలో ప్రత్యేక న్యాయస్థానం అంశం ఉందన్నారు. ఢిల్లీలో ఈరోజు టీఆర్ఎస్ ఎంపీలు సదానందను కలిశారు. హైకోర్టు విభజనపై చర్చించి 15 రోజుల్లో ఉన్నత న్యాయస్థానాన్ని విభజించాలని కేంద్ర మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని కేకే చెప్పారు. సదానందను కలసిన వారిలో జితేందర్ రెడ్డి, వినోద్ ఉన్నారు.