: సల్మాన్ కేసు వాదించేందుకు హాజరుకాని హరీష్ సాల్వే
'హిట్ అండ్ రన్' కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి రెండు రోజుల తాత్కాలిక బెయిలుపై బయటున్న సల్మాన్ కేసు నేడు బాంబే హైకోర్టు వెకేషన్ బెంచ్ పై విచారణకు రానుంది. రెండు రోజుల క్రితం ఇదే కేసులో వాదనలు వినిపించేందుకు ప్రత్యేక విమానంలో వచ్చిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే నేడు గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించాల్సిన మరో కేసు ఉండబట్టే ఆయన రావడం లేదని తెలిసింది. కాగా, ఆయన గైర్హాజరీలో సల్మాన్ తరపున మరో సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు. కాగా, ఐదేళ్ల శిక్షపడ్డ కేసుల్లో పైకోర్టు నిర్ణయం ఒక్కరోజులో వెలువడిన సందర్భాలు లేవు. దీంతో బెయిలును రద్దు చేస్తూ నిర్ణయం వెలువడుతుందా? లేక పొడిగిస్తూ, నోటీసులను జారీ చేస్తారా? అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.