: సోనియాకు 'థ్యాంక్స్' చెప్పిన ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తో సుదీర్ఘకాలంగా సాగుతున్న సరిహద్దు వివాదానికి పరిష్కారం చూపే కీలక బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లా బార్డర్ విషయంలో సంవత్సరాల తరబడి నలుగుతున్న రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభ, రాజ్యసభల్లో అమలు కావడానికి కాంగ్రెస్ అందించిన సహకారాన్ని మరచిపోనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ బిల్లు అమలైతే సరిహద్దులు తెలియకుండా, ఏ దేశపు భూభాగంలో ఉన్నామో అర్థంకాని పరిస్థితుల్లో అల్లాడుతున్న వేలాది మందికి మేలు జరగనుంది. ముఖ్యంగా మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న 51 బంగ్లాదేశీ కాలనీల్లో 15 వేల మంది ఉన్నారు. ఈ బిల్లు ప్రకారం వీరంతా ఇండియాలో భాగం కానున్నారు. ఒకవేళ వారు ఇండియాలో చేరేందుకు నిరాకరించే పక్షంలో బంగ్లాదేశ్ కు తిరిగివెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు.