: వెంకయ్య ఇంటి ముందు ‘హోదా’ నినాదాలు... అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు


దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా పోరు క్రమంగా ఉద్ధృతమవుతోంది. ఓ వైపు ఎంపీలు పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ప్రజా సంఘాలు ఢిల్లీ వీధుల్లో నిరసనలకు దిగుతున్నాయి. నిన్నటికి నిన్న ఆంధ్ర మేధావుల సంఘం పార్లమెంట్ ఆవరణలో నిరసన గళం విప్పింది. పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేసిన ఆ సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సహా పలువురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు వారిని పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ కు తరలించారు. తాజాగా నేటి ఉదయం ఏపీ విద్యార్థి జేఏసీ నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు. తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నినాదాలతో అక్కడి ప్రాంతం దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News