: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ విద్యార్థిని బ్లాక్... 20 ఏళ్లకే బ్రిటన్ ఎంపీగా విజయం


నిన్న జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంకా డిగ్రీ కూడా పూర్తి కాని 20 ఏళ్ల యువతి మేరీ బ్లాక్ ఏకంగా బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. రాజకీయాల్లో దిగ్గజాలను ఢీ కొట్టిన బ్లాక్, లేబర్ పార్టీ అభ్యర్థి డగ్లస్ అలెగ్జాండర్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం గ్లాస్గో యూనివర్సిటీలో చదువుతున్న మేరీ, ఇంకా ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉంది. స్కాట్లాండ్ కు చెందిన మేరీ చదువుకుంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్కాటిష్ నేషనల్ పార్టీ తరఫున బరిలోకి దూకింది. తన సొంత ఊరు పైస్లీ దశాబ్దాలుగా నిరాదరణకు గురైందని, ఈ కారణంగా తన ఊరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులే తనను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News