: తెలంగాణ ఉద్యోగులే ఏపీకి ఆప్షన్ ఇస్తున్నారు: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలంగాణ వాదులపై మండిపడ్డారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణకు ఆప్షన్ ఇస్తున్నారని తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలను ఆయన నిన్న తిప్పికొట్టారు. ‘‘ఏపీ ఉద్యోగులు తెలంగాణకు ఆప్షన్ ఇస్తున్నారనడంలో నిజం లేదు. ఆ లెక్కలు కూడా చూశాం. నిజానికి... ఏపీలో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు కావడంతో తెలంగాణ వాళ్లే ఏపీకి ఆప్షన్ ఇస్తున్నారు. మా ఉద్యోగాలు, మా నీళ్లు అంటూ మాట్లాడిన తెలంగాణ ఉద్యోగులు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి ఆప్షన్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది’’ అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News