: తెలంగాణ సచివాలయం ఎర్రగడ్డలో కాదట... బైసన్ గ్రౌండ్ కు మారనుందట!


రాష్ట్ర విభజన తర్వాత లుంబినీ పార్కుకు అభిముఖంగా ఉన్న సచివాలయాన్ని అక్కడి నుంచి తరలించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి, మానసిక వైద్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించి, అక్కడ కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ యోచించారు. ఈ క్రమంలో అక్కడి ఆ రెండు ఆస్పత్రులను ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది జరిగి రెండు నెలలు కూడా గడవలేదు, సచివాలయం ఏర్పాటయ్యే ప్రదేశం మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్, నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నూ కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాదు పరిధిలోని బైసన్ గ్రౌండ్స్ ను తమకు అప్పగించాలని కోరిన కేసీఆర్, అందులో సచివాలయం నిర్మించుకుంటామని పేర్కొన్నారు. అంటే సచివాలయం ఎర్రగడ్డలో కాకుండా బైసన్ గ్రౌండ్ లో ఏర్పాటు కానుందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

  • Loading...

More Telugu News