: టీ అమ్మాను...పేదరికం చూశాను: మోదీ
పేదరికమే తనలో మొదట స్ఫూర్తి రగిలించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 'టైమ్స్' మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. రైలు బోగీల్లో ఛాయ్ అమ్మేవాణ్ణని ఆయన గతం గుర్తు చేసుకున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు తన తల్లి పాచిపని చేసేదని మోదీ చెప్పారు. పేదరికాన్ని దగ్గరగా చూశానని అదే తనలో స్పూర్తిని రగిలించిందని, ఆ వయసులోనే పేదలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. 13 ఏళ్ల వయసులో స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం కూడా ఇందుకు దోహదం చేసిందని ఆయన చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే తన కోసం బ్రతకకూడదని, సమాజం కోసం బతకాలని నిర్ణయించుకున్నానని, దానినే ఇప్పటికీ ఆచరిస్తున్నానని మోదీ తెలిపారు.