: పెళ్లి అనేది నాకు అర్థం కాదు...డేటింగ్ ఈజీ: కంగనా రనౌత్
పెళ్లి అనేది తనకు అర్థం కాని విషయమని బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ తెలిపింది. తాజా సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, పెళ్లి విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నానని చెప్పింది. పెళ్లి కంటే డేటింగ్ ఈజీ అని తెలిపింది. "మీ స్నేహితులు తొందరగా విడాకులు తీసుకోవడం చూసుంటారు. అదే సమయంలో మీ తల్లిదండ్రులు విజయవంతంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని కూడా గమనించే ఉంటారు. అందుకే వివాహంపై ఈ గందరగోళం" అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. 'క్వీన్' సినిమాకు ముందు తనకు పెద్దగా అవకాశాలు లేవని, ఆ సినిమా తరువాతే పాత్రలు ఎంచుకునే స్థాయికి చేరానని కంగనా చెప్పింది.