: గెలిచి నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు


ఐపీఎల్ సీజన్-8లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు గెలిచి రేసులో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ తో నువ్వా? నేనా? అన్నట్లు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 201 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి బంతి వరకు పోరాడి ఓడింది. 19వ ఓవర్ వరకు విజయం ముంగిట నిలిచిన రాజస్థాన్ ను భువనేశ్వర్ పొదుపు బౌలింగ్ ఓటమి పాల్జేసింది. ఓపెనర్లు అజింక్యా రహానే(8), షేన్ వాట్సన్(12) లు నిరాశ పరిచినా, దూకుడుగా ఆడిన స్మిత్ (68) మ్యాచ్ ను రాజస్థాన్ వైపు మొగ్గేలా చేశాడు. సన్ రైజర్స్ వెంటవెంటనే ఫల్కనర్(30), సంజూ శాంసన్(21) ను అవుట్ చేయడంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. కాగా, మోరిస్(29) శివాలెత్తి సిక్సులతో స్కోరు బోర్డును పరుగులెత్తించడంతో సన్ రైజర్స్ అభిమానులు మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కట్టుదిట్టమైన బంతులతో ఏడు పరుగుల తేడాతో విజయం కట్టబెట్టాడు.

  • Loading...

More Telugu News