: నీతూ అగర్వాల్ ఇంటర్వ్యూ కావాలా?... అయితే 20 వేలు చెల్లించండి!


ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన సినీ నటి నీతూ అగర్వాల్ మరో వివాదంలో చిక్కుకుంది. స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావడంతో ప్రజలకు వాస్తవాలు వెల్లడించే అవకాశాన్ని మీడియా సంస్థలు నీతూ అగర్వాల్ కు కల్పించే ప్రయత్నం చేశాయి. అయితే, పారితోషికం ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తామని నీతూ అగర్వాల్ మేనేజర్ చెప్పడంతో మీడియా సంస్థలు అవాక్కయ్యాయి. సినిమా నిర్మించిన మస్తాన్ వలీని వివాహం చేసుకుని, తన అకౌంట్ ద్వారా డబ్బు బదిలీ చేస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించిన నీతూ అగర్వాల్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను మీడియా సంస్థలు సంప్రదించాయి. నీతూ అగర్వాల్ మేనేజర్ గా పేర్కొన్న వ్యక్తి 20 వేల రూపాయలు చెల్లిస్తేనే ఆమె ఇంటర్వ్యూ ఇస్తారని తెగేసి చెప్పడంతో రిపోర్టర్లు అవాక్కయ్యారు. దీనిని పలు ఛానెళ్లలో ప్రసారం చేయడంతో, డబ్బుకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే నీతూ అగర్వాల్ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News