: కేవలం ఐదు నిమిషాల్లోనే షాపింగ్ పూర్తి
షాపింగ్ అంటే ఊరంతా తిరగాలి, షాపుల్లో దూరాలి, నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే అవి నప్పుతాయో లేదో చెక్ చేసుకోవాలి, ఈ లోపు సీక్రెట్ కెమెరాల నుంచి రక్షణపొందాలి. ఎందుకీ తలనొప్పి ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకుందామంటే ఆర్డిరిచ్చిన వస్తువు వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆన్ లైన్ లో వాడు చూపేది ఒకటి, ఆర్డరిచ్చాక పంపేది మరొకటి. దీంతో షాపింగ్ అంటే పెద్ద ప్రహసనంగా తయారైంది. దీనికి పరిష్కారం చూపిస్తూ, సింగపూర్ లోని ఓ షాపింగ్ మాల్ లో అద్దంలాంటి పరికరాన్ని అమర్చారు. ఈ అద్దం ముందు నిల్చుని మనకు ఏం కావాలో చెబితే, వాటిని అది చూపిస్తుంది. నచ్చిన కలర్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటే, ఆ డ్రెస్ వేసుకున్న తరువాత మనం ఎలా ఉంటామో ఫోటోలు చూపిస్తుంది. నచ్చితే మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను మన ఫోన్ తో స్కాన్ చేస్తే, దుస్తుల ఖరీదు, ఇతర వివరాలు అన్నీ వస్తాయి. ఆ కోడ్ తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి చూపించి, డబ్బులు చెల్లిస్తే, ఆ డ్రెస్ మనకు ఇచ్చేస్తారు. ఇదంతా జరగడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. టెక్నాలజీ భలే ఉంది కదా?...అలాంటి టెక్నాలజీ మనకు కూడా అందుబాటులోకి వస్తే...పట్టుచీరల షాపింగ్ భలే ఈజీ కదా?