: సల్మాన్ శిక్షకు కారణమిదే...!
సల్మాన్ ఖాన్ ఐదేళ్ల కారాగార శిక్షకు కారణం న్యాయస్థానం వెల్లడించింది. నిన్న ఇచ్చిన తీర్పుకు సంబంధించిన 240 పేజీల ప్రతిలో సల్మాన్ శిక్షకు కారణం న్యాయస్థానం పేర్కొంది. 2002లో కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ప్రాంతం నుంచి సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లిపోయాడని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కారణం వల్లే డిఫెన్స్ లాయర్ వాదనలను తాము నమ్మలేకపోయామని న్యాయస్థానం పేర్కొంది. సల్మాన్ ఖాన్ తప్పు చేయకపోయి ఉంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి వెళ్లిపోయి ఉండేవాడు కాదనే అభిప్రాయం న్యాయస్ధానం వెల్లడించింది. చిన్న లాజిక్కు లక్షలాది మంది అభిమాన నటుడి ఐదేళ్ల జైలు శిక్షకు కారణమైంది.