: మంత్రిని అరమైలు దూరం నడిపించిన ఆర్టీసీ కార్మికులు
ఉభయ రాష్ట్రాల్లో సమ్మెతో వేలాది మందిని నడకకు పరిమితం చేసిన ఆర్టీసీ కార్మికులు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సైతం అరమైలు దూరం నడిపించారు. అనంతపురం జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయ్ ఎదురు వచ్చింది. దీంతో, ఆర్టీసీ కార్మికులు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో మంత్రి వారితో అరగంట సేపు చర్చలు జరిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి వివరించారు. కార్మికులు వినకుండా ఆందోళన చేయడంతో, కార్మికులు, మంత్రి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వారి నుంచి తప్పించుకున్న మంత్రి, అరమైలు దూరం నడిచి వేరే వాహనంలో వెళ్లిపోవడం విశేషం.