: చెన్నైలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో ఫిలిప్పీన్స్ కు చెందిన రేనిన్ (36) ఖతార్ నుంచి ధాయ్ లాండ్ లోని పుకెట్ కు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గ మధ్యంలో ఉండగా, రేనిన్ కు నొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులకు ఆమె తాళలేకపోవడంతో పైలట్ కు విమాన సిబ్బంది సమాచారం అందించారు. దీంతో, పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కు కంట్రోల్ విభాగానికి సమాచారమందించడంతో చెన్నైలో ల్యాండయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. వైమానిక సిబ్బంది వైద్యులను సిద్ధంగా ఉంచడంతో, ఆమెను నేరుగా అంబులెన్స్ లోనే ప్రధమ చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించారు.