: ఏపీ ఎంసెట్ కు హైదరాబాద్ లో 35 కేంద్రాలు
ఏపీ ప్రభుత్వం రేపు నిర్వహించనున్న ఎంసెట్ కు హైదరాబాద్ లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఏపీలో 455 సెంటర్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంటవరకు ఇంజినీరింగ్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటలవరకు మెడిసిన్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,55,142 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యార్థులు ఇబ్బందిపడకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.