: సాయ్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఘటన: డైరెక్టర్ జనరల్
కేరళ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) లో జరిగిన సంఘటన సాయ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాలికలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సీనియర్లు, సాయ్ కోచ్ వేధింపులను తాళలేక నలుగురు రోయింగ్ క్రీడాకారిణులు విషపు పండ్లు తిని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. గత రాత్రి విషయం తెలిసిన దగ్గర్నుంచీ వారికి మెరుగైన చికిత్స అందే ఏర్పాట్లు చేశానని ఆయన చెప్పారు. నేటి రాత్రికి అలప్పుళకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టి కేంద్ర మంత్రికి నివేదిక అందజేస్తానని ఆయన తెలిపారు. కాగా, బాలికలు రాసిన సూసైడ్ నోట్ దర్యాప్తు అధికారుల స్వాధీనంలో ఉందని ఆయన వెల్లడించారు.