: ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ దే బాధ్యత: టీకాంగ్ నేతలు పొన్నం, మల్లు


తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని టీకాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బంది డిమాండ్లు న్యాయమైనవని వారు అన్నారు. కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించడం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News