: తెలంగాణలో నైజాం పాలన సాగుతోంది: మోత్కుపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో దుర్మార్గుడి పాలన సాగుతోందని విమర్శించారు. హైదరాబాదులోని సనత్ నగర్ లో ఈ రోజు మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి ప్రసంగించారు. కేసీఆర్ రూపంలో రాష్ట్రంలో మరో నైజాం పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ పాలన నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు అందరూ కలసికట్టుగా ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గోపీనాథ్, టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు.