: రాజ్ నాథ్ తో భేటీ అయిన కేసీఆర్
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ నగర భద్రత, మెగాసిటీ పోలీసింగ్ నిధులు, పోలీసింగ్ మోడ్రనైజేషన్ తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని భద్రత గురించి కేంద్రమంత్రికి కేసీఆర్ వివరించనున్నారు. ఈ భేటీకి కేసీఆర్ తో పాటు డీజీపీ అనురాగ్ శర్మ, టీఆర్ఎస్ ఎంపీలు కూడా హాజరయ్యారు.