: నిజాయతీపరుడైన అధికారిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు... జగన్ పై మంత్రి పల్లె ఆగ్రహం
నిజాయతీపరుడిగా పేరొందిన ఏపీ డీజీపీ జె.వి. రాముడుపై వైకాపా అధినేత జగన్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన డీజీపీపై రాజకీయ విమర్శలు చేయడం తగదని అన్నారు. రాముడు ఏనాడూ పద్ధతి లేకుండా వ్యవహరించలేదని చెప్పారు. రాప్తాడులో జరిగిన హత్య ఫ్యాక్షన్ హత్యే తప్ప... రాజకీయ హత్య కాదని పల్లె స్పష్టం చేశారు. ఈ హత్యతో పోలీసు, రెవెన్యూ అధికారులను ముడిపెట్టడం తగదని సూచించారు.