: ఈ రోజు బస్సులు తీయండి... ఎల్లుండి నుంచి సమ్మె చేసుకోండి: ఆర్టీసీ కార్మికులకు ఎండీ వేడుకోలు


రేపు అత్యంత కీలకమైన ఎంసెట్ పరీక్ష జరగనున్నందున మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పరీక్షలు రాస్తున్న వారిలో ఆర్టీసీ కార్మికుల పిల్లలు కూడా ఉన్నారని, కనీసం వారి ఇబ్బందులనైనా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. తాము కార్మికుల సంక్షేమానికి కట్టుబడి వున్నామని, వారడిగిన మూడు డిమాండ్లలో రెండింటికి అంగీకరించామని చెప్పిన సాంబశివరావు తక్షణం విధుల్లో చేరి బస్సులను బయటకు తేవాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఇవాళ బస్సులను బయటకు తేవాలని, ఎల్లుండి తిరిగి సమ్మెలోకి వెళ్లచ్చని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషనుకు ఆదాయం ఉంటే ఎంత వేతనమైనా ఇచ్చేందుకు సిద్ధమని, గతంలో క్యాన్సర్ బారినపడ్డ ఓ కార్మికుడికి 20 లక్షల రూపాయల పైన ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సమ్మె ఎంత తీవ్రంగా జరిగినా ఈ సాయంత్రానికి 45 శాతం బస్సులను నడిపిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News