: బ్రిటన్ లో ప్రారంభమైన పోలింగ్
బ్రిటన్ లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు, కౌన్సిల్ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 9వేల కౌన్సిల్ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 50 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ తరపున డేవిడ్ కామెరూన్, లేబర్ పార్టీకి చెందిన ఎడ్ మిల్లిబాండ్స్ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. మొత్తం 650 మంది ఎంపీలను ఓటర్లు ఎన్నుకోనున్నారు. ఈ అర్ధరాత్రిలోగా ఫలితాలపై ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.