: పరీక్షా కేంద్రాలకు ఒక రోజు ముందుగానే చేరండి: ఎంసెట్ అభ్యర్థులకు ఆర్టీసీ ఎండీ ఉచిత సలహా


కార్మికుల సమ్మెను విరమింపజేయడంలో సఫలం కాని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రం ఉచిత సలహా పడేశారు. పరీక్షా కేంద్రాలకు ఒకరోజు ముందుగానే చేరుకోవాలని ఆయన కొద్దిసేపటి క్రితం సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అరకొర బస్సులే తిరుగుతున్నాయి. ఇదే సమయంలో రేపు ఏపీలో ఎంసెట్ పరీక్ష జరుగుతోంది. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడమే తరువాయి. తెల్లవారగానే రేపు పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సాంబశివరావు ఎంసెట్ విద్యార్థులు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అంటే నేటి సాయంత్రంలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని ఆయన చెప్పారు. అయితే మరి రాత్రి బస, భోజనం ఖర్చులు ఎలాగన్న విషయాన్ని మాత్రం ఆర్టీసీ ఎండీ చెప్పలేదు.

  • Loading...

More Telugu News