: స్మార్ట్ సిటీలపై రాజ్యసభలో కేవీపీ సందేహం... అవగాహన చేసుకోవాలన్న వెంకయ్య


"అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి?" అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఈరోజు రాజ్యసభలో సందేహం వ్యక్తం చేశారు. దానికున్న మార్గదర్శకాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. స్మార్ట్ సిటీలు ప్రకటించడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటని, విశాఖను స్మార్ట్ సిటీ చేయడానికి అమెరికా ఎటువంటి సాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిబంధనలలో ఏమైనా సడలింపులు ఉంటాయా? అని కూడా అడిగారు. దానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమాధానం ఇస్తూ, స్మార్ట్ సిటీల విధానానికి కేంద్ర ఆమోదం తెలిపిందన్నారు. మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? వాటిని ఎలా అభివృద్ధి చేస్తారన్న విషయాలపై స్పష్టత ఉంటే మంచిదేనని, కాకపోతే ఎంపీలకే ఈ విషయంపై ఇంకా అవగాహన లేకపోతే, సాధారణ జనానికి ఏం తెలుస్తుందని అన్నారు. కాబట్టి స్మార్ట్ సిటీలపై తెలుసుకోవాలని పరోక్షంగా వెంకయ్య సూచించారు.

  • Loading...

More Telugu News