: ఢిల్లీలో రక్షణ మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ పరిధిలోని జింఖానా, పోలో మైదానాలపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ సచివాలయాన్ని సికింద్రాబాద్ పోలో మైదానానికి మార్చాలనుకుంటున్న కేసీఆర్ ఆ భూములను రాష్ట్రానికి అప్పగించాలని పారికర్ ను కోరారు. అంతేగాక గొల్కొండ కోట స్థలాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నట్టు తెలుస్తోంది. నిన్న (బుధవారం) రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేసీఆర్ ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఉంటారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు నలుగురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తారు.