: ఒక్కో ఉంగరం ఖరీదు రూ.100 కోట్లట... జెనీవా వేలంలో అరుదైన రింగ్స్
అవును, నిజమే! వందల కోట్ల రూపాయల విలువ ఉన్న రెండు ఉంగరాలు ప్రస్తుతం స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జరుగుతున్న వేలంలో ఉన్నాయి. లేత గులాబీ రంగు, రూబీ డైమండ్ ఉంగరాల ప్రారంభ ధర 14 కోట్ల డాలర్లు. ఇక వేలంలో ఈ ఉంగరాలు 18 కోట్ల డాలర్ల వరకూ అమ్ముడుపోయే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంటే ఒక్కో ఉంగరం ఖరీదు ఎంతలేదన్నా రూ.88 కోట్లు పలుకుతుంది. ఇక 18 కోట్ల డాలర్లకు అమ్ముడుబోతే, వాటి ధర అక్షరాలా రూ.100 కోట్లన్నమాట.