: విషం తాగిన నలుగురు క్రీడాకారిణులు... ఒకరి మృతి


తన శిక్షణతో క్రీడాకారులను అత్యుత్తమంగా తయారు చేయాల్సిన కోచ్... వీరి పాలిట మాత్రం శాపంగా పరిణమించాడు. కోచ్ పెట్టిన శారీరక, మానసిక హింసకు తాళలేక నలుగురు క్రీడాకారిణులు విషం తాగి, బలవన్మరణానికి ప్రయత్నించారు. వీరిలో ఒక క్రీడాకారిణి మృతి చెందగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన కేరళలోని అలప్పుజలో ఉన్న ఓ స్పోర్ట్స్ కేంద్రంలో జరిగింది. విషం తాగిన క్రీడాకారిణులు రోవర్లుగా శిక్షణ పొందుతున్నారు. చనిపోయిన అమ్మాయిని కోచ్ తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. నిన్న రాత్రి తమ హాస్టల్ గదిలో స్పృహ లేకుండా పడిఉన్న ఈ నలుగురు అమ్మాయిలను హాస్టల్ వార్డన్, సహాయకుడు ఆసుపత్రికి తరలించారు. గతంలోనే కోచ్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... హింసకు తాళలేకే తమ పిల్లలు ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News