: సల్మాన్ కు అంత హడావుడి బెయిల్ ఏంటి?: తక్షణం రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్


మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, ఒకరి మృతికి, మరో నలుగురు గాయపడడానికి కారణమైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఇచ్చిన మధ్యంతర బెయిలును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో బాంబే హైకోర్టు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, హడావుడిగా ఆ నటుడికి బెయిలిచ్చిందని, అంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ, కొందరు స్పెషల్ లీప్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ కు సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలుశిక్ష విధించగా, ఆ వెంటనే హైకోర్టు రెండు రోజుల బెయిలిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News